ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయా? అయితే ఇంట్లో నైరుతి దిశలో పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టుకుంటే కనకవర్షం తప్పదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. నైరుతి దిశలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వుంచి నిత్యం ఆ విగ్రహానికి పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు వుండవు. రుణబాధలు తొలగిపోతాయి.
ఇంకా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలంటే.. ఇంటికి ఉన్న ప్రధాన ద్వారం వద్ద తలుపుల పక్కనే గోడలపై లక్ష్మి లేదా కుబేరుడు లేదా స్వస్తిక్ సింబల్ ఉన్న ఫొటోను పెట్టుకోవాలి. దీంతో డబ్బు వృధా ఖర్చు కాకుండా ఉంటుంది.
మట్టితో తయారు చేయబడిన కూజా లేదా చిన్నపాటి కుండను ఇంట్లో పెట్టి అందులో ఎప్పుడూ నీటిని ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ కూజా ఉత్తరం దిశలో ఉండాలి. దీని వల్ల డబ్బు పొదుపు అవుతుంది. ఖర్చులు తగ్గుతాయి. డబ్బు చేతిలో నిలుస్తుంది. అయితే కుండను తెరచి ఉంచరాదు. కచ్చితంగా మూత పెట్టాలి. అందులో నీరు కూడా కచ్చితంగా ఉండాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
ఇంకా లోహంతో తయారు చేయబడిన చేప లేదా తాబేలు బొమ్మను, వెండి, ఇత్తడి లేదా రాగితో తయారు చేసిన పిరమిడ్ బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉంచుకుంటే అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. చాలామంది మెట్ల కింద చీపుర్లు, ఇల్లు తుడిచే మాపులు, చెప్పులు, షూస్‌లను ఉంచుతారు. అలా చేయరాదు. చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి. కనుక వాటిని వెంటనే తీసేయాలని వాస్తు శాస్త్రం చెప్తోంది.