Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20-05-2020 బుధవారం దినఫలాలు - గాయిత్రీ మాతను ఆరాధిస్తే...

Advertiesment
20-05-2020 బుధవారం దినఫలాలు - గాయిత్రీ మాతను ఆరాధిస్తే...
, బుధవారం, 20 మే 2020 (05:00 IST)
మేషం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగంలోని వారికి ఒత్తిడి తప్పదు. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలడంతో పొదుపు సాధ్యంకాదు. వైద్యులకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. 
 
వృషభం : ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సత్ఫలితాలు లభిస్తాయి. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. పాత జ్ఞాపకాలు గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పొందుతారు. 
 
మిథునం : విద్యుత్, ఏసీ కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి సంతృప్తి లభిస్తుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. మీ ప్రియతముల పట్ల ముఖ్యుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయడం మంచిది. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. 
 
కర్కాటకం : నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. 
 
సింహం : పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. కుటుంబ సమేతంగా ఒక పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు చేస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పనిచేసే చోట కించెత్తు లోపాన్ని చూపించి, ఎదుటివారు మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు. 
 
కన్య : ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది. ఇతరుల గురించి సంభాషించేటపుడు ముందు వెనుకలుగా గమనించండి. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రయాణాలలో అశాంతి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. 
 
తుల : ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు అధికమవుతాయి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. కానివేళో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. దైవ, సేవా సాంఘీక కార్యక్రమాలలో పాల్గొంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. 
 
వృశ్చికం : బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీలకు ఆలయ సందర్శనాలలో చికాకులు తప్పవు. అర్థాంతరంగా నిలిపివేసిన గృహ మరమ్మతులు, పనులు పునఃప్రారంభిస్తారు. మీ మాటలు ఇతరులకు చేరవేసే వ్యక్తులున్నారని గమనించండి. 
 
ధనస్సు : వ్యాపారాభివృద్ధికి, వ్యాపార విస్తరణల కోసం చేసే యత్నాలు క్రమంగా సత్ఫలితాలనిస్తాయి. రచన సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. స్త్రీలు ఆత్మీయులతో పరస్పరం కానుకలిచ్చుపుచ్చుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపం, పట్టింపులు అధికమవుతాయి. 
 
మకరం : బంధువుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. దైవ దర్శనాల్లో అసౌకర్యానికి లోనవుతారు. క్రీడ, కళాకారులు బాగా రాణిస్తారు. దృఢ సంకల్పం ద్వారా అన్ని కష్టాలు అధికమిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి చికాకులు అధికం. 
 
కుంభం : ఉన్నతస్థాయి అధికారులు ధనప్రలోభం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీలు వాహనం నడుపుతున్నపుడు, నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మొహమ్మాటాలకు పోయి దుబారా ఖర్చులు చేయకండి. 
 
మీనం : ప్రైవేట్ విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, ఒత్తిడి అధికం. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతారు. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయాలో జాగ్రత్త వహించండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శంఖువు ఇంట్లో వుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయా?