Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెయిల్ పాలిష్‌ని రెగ్యులర్‌గా పెట్టుకుంటే.. బరువు పెరిగిపోతారట..

Webdunia
మంగళవారం, 21 మే 2019 (14:51 IST)
అమ్మాయిలు చేతి వేళ్లు అందంగా కనిపించాలని చాలా తాపత్రయపడతారు. రకరకాల నెయిల్ పాలిష్‌లు పెట్టుకుంటారు. అయితే వాటి వలన కలిగే దుష్ప్రభావాల గురించి ఆలోచించరు. నెయిల్ పాలిష్‌ని రెగ్యులర్‌గా పెట్టుకోవడం వలన బరువు అమాంతంగా పెరిగిపోతారని పరిశోధనల్లో తేలింది. ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనంతో నెయిల్ పాలిష్ తయారు చేస్తారు. 
 
ఈ రసాయనం ఒక ప్లాస్టిక్. ఫామ్ ఫర్నీచర్‌కి మంటలు అంటుకోకుండా వాడే ఈ రసాయనాన్ని నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు మన్నేందుకు ఉపయోగిస్తారు. వీటిని వాడటం వల్ల మానవ హార్మోన్లపై ప్రభావం పడుతుంది, దాంతో అమ్మాయిలు బరువు పెరుగుతారని పరిశోధకులు అంటున్నారు. దాదాపు 49 శాతం నెయిల్‌ పాలిష్‌లలో ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉంటుందని తేల్చారు. 
 
ఇలాంటి నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, వీటిని పెట్టుకున్న 10 నుండి 14 గంటల్లోపే మనలో టీపీహెచ్‌పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అందుకే నెయిల్ పాలిష్‌ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఆర్టిఫీషియల్ నెయిల్స్ పెట్టుకొని నెయిల్ పాలిష్ వేసుకుంటే సమస్యలు రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments