వేసవిలో తాటి ముంజలు.. తీసుకుంటే ఇవే ప్రయోజనాలు..

శనివారం, 11 మే 2019 (15:20 IST)
వేసవిలో తాటి ముంజలు తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. శరీరానికి చలువ చేసే తాటి ముంజలు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తాయి. ముంజల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే చాలు, పొట్ట నిండినట్లు అనిపించి, ఆహారాన్ని మితంగా తీసుకునే వీలుంటుంది. తద్వారా అధిక బరువు నుంచి బయటపడటానికి పరోక్షంగా దోహదం చేస్తాయి. 
 
వేసవిలో చర్మ సమస్యలు తొలగించుకోవాలంటే.. తాటి ముంజలు తప్పకుండా తీసుకోవాలి. తాటి ముంజల్లో ఉండే నీరు మన శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చేస్తుంది. ఎండవేడి నుంచి కాపాడుతుంది. అధిక చెమట వల్ల వచ్చే నిస్సత్తువ నుంచి కూడా సులువుగా ఉపశమనం పొందొచ్చు. మొటిమలపై, చెమటకాయలపై ముంజుల్లో ఉండే నీటిని రాస్తే అవి తగ్గుముఖం పడతాయి.
 
గర్భిణీల్లో తలెత్తే జీర్ణాశయ సమస్యలకు ఇవి చక్కని పరిష్కారం. అంతేకాదు, ఎసిడిటీని దూరం చేసే గుణాలు వీటిలో ఉన్నాయి. అజీర్తిని కూడా తగ్గిస్తాయి. తాటి ముంజల్లో కెలొరీలు తక్కువే కానీ.. అవసరమైన శక్తిని పొందొచ్చు. 
 
శరీరం నిస్సత్తువగా అనిపించినప్పుడు వీటిని తింటే తక్షణ శక్తి అందుతుంది. వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ముంజలు ఎంతగానో ఉపయోగపడుతాయి. వడదెబ్బ తగలకుండా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

తర్వాతి కథనం మజ్జిగలో మిరియాల పొడి చేర్చి తాగితే..?