వారానికి ఐదు వెల్లుల్లి పాయల్ని పచ్చివి లేదా వండినవి తింటే కేన్సర్, హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి పాయల్ని తీసుకోవడం ద్వారా 30 నుండి 40 శాతం వరకు కేన్సర్ తగ్గుతుందని వారు అంటున్నారు.
ఇకపోతే వెల్లుల్లిలో రోగనిరోధక గుణాలు అధికంగా వున్నాయని, దీంతో రోగకారక క్రిములను నాశనం చేయటానికి ఇది ఉపయోగ పడుతుంది
రక్తలేమితో బాధపడుతున్నవారు వెల్లుల్లి రసాని సేవిస్తే తప్పనిసరిగా రక్తకణాలు పెరిగే సూచనలున్నాయని, ఇందులో విటమిన్ సీ ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇంకా దగ్గుతో బాధపడుతున్నవారు ప్రతి రోజు వెల్లుల్లి రసం ఉదయం- రాత్రి ఐదు చుక్కల చొప్పున తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.