బడ్జెట్ 2020, ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు మోదీ సర్కార్ కసరత్తు... ఏంటి?

Webdunia
శుక్రవారం, 24 జనవరి 2020 (14:06 IST)
బడ్జెట్ 2020కి మరికొన్ని రోజులే సమయం వుంది. బడ్జెట్ అనగానే వేతన జీవులు ఎంతో ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అదే... ఆదాయపన్ను మినహాయింపు ఎంతమేరకు వుంటుందనేది. కాస్త వెసులుబాటు కల్పిస్తే తమ జీవితం మరింత సాఫీగా వుంటుందని ఆశపడటం సహజమే.

గత ఏడాది ప్రవేశపెట్టిన టాక్స్ శ్లాబుల వల్ల వేతన జీవులపై పన్ను బాదుడు అంత తక్కువేమీ లేదన్న వాదనలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఈసారి మరికాస్త కసరత్తు చేసి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారనే వార్తలు వస్తున్నాయి.
 
ఇప్పుడు బేసిక్‌ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా వుండగా దీన్ని రూ 3 లక్షలు లేదా రూ 3.5 లక్షలకు పెంచుతారని అంచనా వేస్తున్నారు. ఆదాయపన్ను శ్లాబులు, పన్ను రేట్లలో మార్పులు తీసుకొచ్చేందుకు మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఆ ప్రకారం ఈసారి రూ.7 లక్షల దాకా ఆదాయం ఉన్న వారికి 5 శాతంగా పన్ను వుండనుందని అంచనా. అలాగే 7 నుంచి 10 లక్షల ఆదాయం ఉన్న వారికి 10 శాతం పన్ను విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఉన్న 5, 20, 30 శాతం శ్లాబులు పన్ను భారాన్ని విపరీతంగా పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిన నేపధ్యంలో ఈమేరకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments