Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 19 April 2025
webdunia

దేశ వ్యాప్తంగా ఉల్లి ఘాటు.. మహిళల భద్రతే ముఖ్యం : విత్తమంత్రి బుగ్గన

Advertiesment
AP Assembly
, సోమవారం, 9 డిశెంబరు 2019 (14:09 IST)
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయనీ, అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు సబ్సీడీలో కిలో 25 రూపాయలకే ఉల్లిని సరఫరా చేస్తున్నామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం అసెంబ్లీలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉల్లిగడ్డల విషయం అందరికీ సంబంధించిన విషయం. ఉల్లిగడ్డల విషయంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉల్లిగడ్డల విషయంపై ముఖ్యమంత్రి క్లుప్తంగా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే ఇవాళ రైతుబజార్లలో రూ.25కే కిలో ఉల్లి ఇస్తోందని. ఎక్కడో షోలాపూర్, రాజస్థాన్‌ నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఇంకా మెరుగుపర్చేదానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. 
 
అన్నిటికన్నా ఉల్లి పట్ల ఒక ప్రోపర్‌ ఫార్మాట్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిసేటప్పుడు, ఏ విషయం పట్ల ఇప్పుడు చర్చ ఉంది అధ్యక్షా, ఇప్పుడు బిజినెస్‌లో మహిళల భద్రత పట్ల, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల. 
మహిళల మీద, పిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటాయి. కానీ ఎక్కడో ఒకచోట దేశం మొత్తం నిలబడి చూస్తోంది.. అటువంటి సంఘటనే మొన్న హైదరాబాద్‌లో జరిగిన సంఘటన. అందులో భాగంగా చట్టం కూడా తీసుకురావాలి. 
 
మీరు మీ సలహాలు కూడా ఇవ్వండి అని స్టేట్‌మెంట్‌ ఇస్తుంది ఎవరు అధ్యక్షా. ఒక మహిళా, రాష్ట్ర హోంశాఖమాత్యులు స్టేట్‌మెంట్‌ ఇస్తుంటే వాళ్లు ఉద్దేశ్యపూర్వకంగా డిస్ట్రబ్‌ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఉల్లిమీద చర్చిస్తామని చెపుతున్నా.. వాళ్లకు నిజంగా బాధ్యత ఉంటే, ఈ అంశంమీద చర్చించాలని ఉంటే ఒక డబ్బాలో గిప్ట్‌ రేఫర్‌లో స్పీకర్‌కు ఉల్లిగడ్డలిస్తారా. ఎంత బాధ్యతారహితంగా ఉన్నారో అర్థమవుతోంది. నిజంగా వాళ్లకు అంత కన్సర్న్‌ ఇంటే బయట రూ.25కు రైతుబజార్లలో అమ్ముతుంటే వాళ్ల హెరిటేజ్‌ మాల్స్‌లో రూ.200కే కేజీ ఉల్లిగడ్డలు అమ్ముతున్నారు. 
 
ఈ రోజు ప్రతిపక్షనేతకు బాధ్యత ఉంటే తాను పర్చేజ్‌ చేసిన ధరకే ఉల్లి అమ్మకాలు చేపడతానని చెప్పాలి. వాళ్లకు లాభాలు కావాలి. అక్కడ మాత్రం లాభాలు వదిలిపెట్టకూడదు. కానీ ఈ రోజు సభలో అతి ముఖ్యమైన మహిళల భద్రతమీద డిస్కసన్‌ జరుగుతుంటే దాన్ని మాత్రం పట్టించుకోరు. చివరకు స్పీకర్‌కు ఉల్లిగడ్డలు గిప్ట్‌ బాక్స్‌ ఇవ్వడం దారుణం. సభా సమయాన్ని వృధా చేయడం చాలా దారుణం. బాధ్యతా రాహిత్యం. మరీ ముఖ్యంగా  మహిళల పట్ల వారికి (ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి) ఎంత వరకు కన్సర్న్‌ ఉందనేది క్లియర్‌గా కనిపిస్తా ఉంది అధ్యక్షా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో సైబర్‌ మిత్ర.. వాట్సాప్‌ నెంబర్‌ 9121211100