Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో సైబర్‌ మిత్ర.. వాట్సాప్‌ నెంబర్‌ 9121211100

Advertiesment
ఏపీలో సైబర్‌ మిత్ర.. వాట్సాప్‌ నెంబర్‌ 9121211100
, సోమవారం, 9 డిశెంబరు 2019 (14:01 IST)
ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ 9121211100 ఏర్పాటు చేయటం జరిగిందని ఏపీ హోం మంత్రి సుచరిత వెల్లడించారు. అసెంబ్లీలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె పై విధంగా సమాధానమిచ్చారు. అంతేగాక సైబర్ నేరాలపై అవగాహన కల్పించటం, మహిళల్లో విశ్వాసాన్ని నింపటానికి బహిరంగ ప్రచారాలు, అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించటం జరుగుతుందని సుచరిత వివరించారు. 
 
మహిళల భద్రత కోసం కఠినమైన న్యాయ చర్యలు చేయటానికి వీలుగా మహిళా నేరాలపై కేసులు తక్షణ నమోదు చేయటానికి అన్ని పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు దీర్ఘకాలిక సూచనలు ఇవ్వటం జరిగిందన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటానికి ఏపీ డీజీపీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. 
 
పోస్కో కేసుల పరిష్కారం కోసం 8 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు 
ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి మహిళలపై నేరాల పరిష్కారం కోసం 13 జిల్లాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. వీటికి అదనంగా 2019 అక్టోబర్‌ 2 నుంచి పోస్కో కేసుల పరిష్కారం కోసం 8 ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు పనిచేస్తున్నాయి. మహిళా హెల్ప్‌ లైన్‌ 100, 112 ఏకైక అత్యవసర హెల్ప్‌ లైన్‌ ఇందులో పోలీస్‌, అగ్నిమాపక, ఇతర హెల్ప్‌లైన్‌ కలిసి ఉంటాయి. 
 
ఏపీ మహిళా హెల్ప్‌లైన్‌ సార్వత్రీకరణ కింద.. 181 ప్రత్యేకంగా ఉంది. ఉచిత హెల్ప్‌లైన్‌ కింద 181కి నిర్భయ కింద నిధులు సమకూర్చటం జరుగుతుంది. 2016 నుంచి ఈరోజు వరకు 7,95,989 కాల్స్‌ స్వీకరించటం జరిగింది. 6,63,636 కాల్స్‌ సమాచారం కోసం సమాధానం ఇవ్వటం జరిగిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. తక్షణ సహాయం కింద చెల్లుబాటు అయ్యే కేసులుగా 3,480 కాల్స్‌ గుర్తించటం జరిగిందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెలివరీ బాయ్‌కి ఫ్రీ ఫుడ్ పెట్టిన మహిళ.. వీడియో వైరల్