స్పెషల్ స్టేటస్ డిమాండ్ : వైకాపా ఎంపీల రాజీనామాలు ఆమోదం

వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్రవేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఐదుగురు

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (18:59 IST)
వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్రవేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెల్సిందే.
 
వాస్తవానికి ఈ రాజీనామాలు గత ఏప్రిల్ 6వ తేదీన చేశారు. ఆ తర్వాత ఈ రాజీనామాలను పరిశీలించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్... ఆ ఐదుగురు ఎంపీలను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు. అపుడు కూడా రాజీనామాలకు కట్టుబడివున్నట్టు వారు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో వారి రాజీనామాలను స్పీకర్ గురువారం ఆమోదించారు. ఈ రాజీనామాలు చేసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి) మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), మిథున్ రెడ్డి (రాజంపేట), వైఎస్ అవినాష్ రెడ్డి (కడప)లు ఉన్నారు. అయితే, వీరి రాజీనామాలు ఆమోదించినప్పటికీ.. ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహంచే అవకాశం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments