బీజేపీ, వైసీపీ పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి..!
బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు కుదిరిందని... వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా.... వీరిద్దరితో జనసేన అధ్యక్షుడు పవన్ కూడా కలుస్తాడని తెలుగుదేశం
బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు కుదిరిందని... వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా.... వీరిద్దరితో జనసేన అధ్యక్షుడు పవన్ కూడా కలుస్తాడని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తుండటం తెలిసిందే. ఈ ప్రచారంపై బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్‌తో కలిసి బీజేపీ పనిచేస్తోందనడం అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ఢిల్లీలో నలుగురు సీఎంల కలయిక భావసారూప్యం లేనిదన్నారు. వాళ్లు ఎంతకాలం కలిసి పనిచేస్తారో చూద్దామని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు లేవనెత్తిన అంశాలకు కేంద్రం సమాధానం చెప్పలేదనడం అసత్య ప్రచారమని అన్నారు.