ఆ అమ్మాయికి మా ఇంటి నుంచి తాళి, చీర పంపాం: పరిటాల శ్రీరామ్
అనంతపురం జిల్లాలో ఎక్కడ ఏ హత్య జరిగినా, కిడ్నాప్ జరిగినా తనతో ముడిపెట్టడం భావ్యం కాదన్నారు మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్. కేఎన్ పాల్యలో అమ్మాయి హత్య, కందుకూరులో జరిగిన హత్య, ధర్మవరంలో జరిగిన కిడ్నాప్ తదితర ఘటనల వెనుక తన హస్
అనంతపురం జిల్లాలో ఎక్కడ ఏ హత్య జరిగినా, కిడ్నాప్ జరిగినా తనతో ముడిపెట్టడం భావ్యం కాదన్నారు మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్. కేఎన్ పాల్యలో అమ్మాయి హత్య, కందుకూరులో జరిగిన హత్య, ధర్మవరంలో జరిగిన కిడ్నాప్ తదితర ఘటనల వెనుక తన హస్తం లేదని ఆయన తెలిపారు. కేఎన్ పాల్యలో చనిపోయిన అమ్మాయి పెళ్లికి మా ఇంటి నుంచే తాళిబొట్టు, చీర పంపామని శ్రీరామ్ చెప్పారు.
అంతే కాకుండా... మా చిన్నాన్న చనిపోతే దాని గురించి వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరం. పరస్పర అభివృద్ధి కోసం అందరం కలిసి పాటుపడ్డాం. ఐదు రోజులపాటు ఎంతో కష్టపడి ఆయన మా చెల్లి పెళ్లి చేశారు. చమన్ మా ఇంట్లో వ్యక్తి. నాన్నకు కూడా ఎంతో ముఖ్యమైన వ్యక్తి. రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసి మా మనసుల్ని గాయపరుస్తున్నారని శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేసారు.
నాగూర్ హుస్సేన్ అనే మాజీ మావోయిస్టుతో కలిసి పదిమంది హత్యకు కుట్ర పన్నారని విజయసాయి రెడ్డి చేసిన విమర్శలపై పరిటాల శ్రీరామ్ మండిపడ్డారు. నాలుగేళ్లుగా లేనిది ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ.. పరిటాల కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మేం భూ దందాలు చేయడం లేదన్నారు.