Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం అరెస్టుకు ఆమే కారణమా? చిద్దూను 5 రోజులు అప్పగించాలంటే...

Webdunia
గురువారం, 22 ఆగస్టు 2019 (18:58 IST)
ఐఎన్ ఎక్స్ మీడియా స్కాంలో ఇంద్రాణి ముఖర్జీ, ఆమె భర్త పీటర్ ముఖర్జీ సహ నిందితులు. ఐఎన్ ఎక్స్ మీడియాను 2007లో స్థాపించారు ఈ దంపతులు. ఆ సమయంలో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రి. విదేశీ పెట్టుబడులు చిదంబరం పర్యవేక్షణలోనే ఉండేది. దీంతో చిదంబరం కుమారుడు కార్తీక్ సహకారంతో 305 కోట్ల రూపాయలను సమకూర్చుకున్నారన్నది ఆరోపణ. 
 
అడ్వాంటేజ్ ఇండియాతో పాటు కార్తీ చిదంబరానికి విదేశాల్లో ఉన్న అడ్వాంటేజ్ సింగపూర్ నుంచి ఈ విదేశీ నిధులు ఐఎన్ ఎక్స్ మీడియాకు బదలాయించారు. ఇందుకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం ఆమోదం లభించడానికి ఆర్థికమంత్రిగా చిదంబరం తన పలుకుబడి ఉపయోగించారన్నది ఆరోపణ.
 
ఈ పెట్టుబడుల వ్యవహారంలో చిదంబరం ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారన్నది అభియోగం. ఇంద్రాణి ముఖర్జీ దంపతులతో ఆయన పలుమార్లు భేటీ అయ్యారనీ, ఈ విషయాన్ని ఇంద్రాణి స్వయంగా వివరించినట్లు సీబీఐ నివేదికలో వెల్లడించింది. ఐఎన్ఎక్స్‌లో ఎంత పెట్టుబడులు పెట్టారోనన్న విషయాన్ని సిబిఐకి ఆమె తెలియజేసింది. ఈ స్టేట్మెంట్ ఆధారంగా సిబిఐ చిదంబరాన్ని అరెస్టు చేసింది. 
 
కొడుకు కార్తీక్ ఒత్తిడితో చిదంబరం ఇలా చేసినట్లు సిబిఐ విచారణలో వెల్లడయినట్లు తెలుస్తోంది. ఇబ్బందులు వస్తాయని తెలిసినా చిదంబరం విదేశీ పెట్టుబడులు మళ్ళించే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదన్నది వాదన. కాగా చిదంబరాన్ని 5 రోజుల పాటు తమకు అప్పగించాలని సీబీఐ కోరింది. ఐతే కోర్టు దీనిని రిజర్వులో వుంచింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments