Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంకీపాక్స్ వైరస్ సోకిందా.. అయితే ఇలా చేయండి...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (20:57 IST)
ప్రపంచ దేశాలను మంకీపాక్స్ వైరస్ భయపెడుతోంది. ఇప్పటికే 75 దేశాల్లో 16 వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదైవున్నాయి. మన దేశంలో కూడా నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వైరస్ సోకితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై తాజాగా కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
మంకీపాక్స్ వైరస్ సోకినవారితో పాటు వారికి సన్నిహితంగా ఉన్నవారు కూడా కొన్ని రోజులు పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారితో పాటు వారితో మాట్లాడినవారు, కలిసి భోజనం చేసినవారు కూడా జాగ్రత్తలు పాటించాలి. 
 
ఈ వైరస్ సోకినవారు ఖచ్చితంగా 21 రోజుల పాటుగానీ, వారి శరీరంపై అయిన దద్దుర్లు లేదా పుండ్లు పూర్తిగా తగ్గిపోయే వరకు గానీ ఐసోలేషన్‌లో ఉండాలి. 
 
వైరస్ సోకినవారితో సన్నిహితంగా ఉండేవారు మూడు పొరల మాస్క్‌ను ముఖానికి ధరించాలి. 
 
ఈ వైరస్ సోకినవారు లేదా సన్నిహితంగా ఉన్నవారు కూడా కొంతకాలం పాటు రక్తదానం చేయరాదు. 
 
మంకీపాక్స్ వైరస్ సోకినవారికి వైద్య సేవలు అందించిన వైద్యులు, నర్సింగ్, ఇతర సహాయక సిబ్బంది కూడా 21 రోజుల పాటు ప్రత్యేక పరిశీలనలో ఉండాలి. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుంటే తగిన జాగ్రత్తలతో విధులు నిర్వహించవచ్చు. ఏవేని లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఐసోలేషన్‍‌లో ఉండాలి. 
 
మంకీపాక్స్ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పైగా, ఇది ప్రాణాపాయం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యం చేయించుకుంటే మాత్రం కొద్ది రోజుల్లోనే కోలుకుని రోజువారీ జీవతం గడపవచ్చని కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments