Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు పిల్లలు - భర్తను వదిలేసి 14 యేళ్ల బాలుడుతో 31 యేళ్ల మహిళ జంప్

Webdunia
బుధవారం, 27 జులై 2022 (20:41 IST)
సభ్యసమాజం తలదించుకునే ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. నలుగురు పిల్లలు, భర్తను వదిలేసిన ఓ 31 యేళ్ళ వివాహిత 14 యేళ్ళ బాలుడుని తనతో లేపుకెళ్ళి సహజీవనం చేయసాగింది. వారిద్దరూ హైదరాబాద్ నగరంలో ఉన్నట్టు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 31 యేళ్ల వివాహితకు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారు. ఈమెకు ఎదురింటిలో ఉండే 14 యేళ్ల బాలుడితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ బాలుడు స్థానికంగా ఓ ఇంగ్లీష్ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడటంతో ఆ బాలుడు పాఠశాలకు సక్రమంగా వెళ్ళడం లేదు. 
 
దీన్ని గమనించిన తల్లిదండ్రులు బాలుడిని పలుమార్లు హెచ్చరించారు. దీంతో ఆ బాలుడు తనకు దూరమవుతున్నాడని ఆందోళన చెందిన ఆ మహిళ.. తన నలుగురు పిల్లలు, భర్తను వదిలివేసి ఆ బాలుడిని తీసుకుని హైదరాబాద్ నగరానికి వెళ్ళిపోయింది. అక్కడ బాలానగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని బాలుడితో సహజీవనం చేయసాగింది. 
 
కొద్ది రోజుల తర్వాత ఆ బాలుడు తన తల్లిదండ్రులను చూసేందుకు గుడివాడకు వెళ్లాలని భావించాడు. తన వద్ద డబ్బులు లేకపోవడంతో తన స్నేహితులకు మొబైల్‌లో ఓ మెసేజ్ పెట్టాడు. ఈ మెసేజ్‌కు స్నేహితులెవ్వరూ స్పందించలేదు. దీంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. 
 
అప్పటికే తమ కుమారుడు కనిపించలేదని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసివున్నారు. ఇపుడు బాలుడు నుంచే ఫోన్ రావడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు గుడివాడ టూటౌన్ పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలు బాలుడు మొబైల్ లొకేషన్ ఆధారంగా గుర్తించి వారున్న ఇంటికి వెళ్ళారు. 
 
మంగళవారం రాత్రి బాలానగర్‌లో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని బుధవారం ఉదయం గుడివాడకు తీసుకొచ్చారు. ఆ బాలుడికి వైద్య పరీక్షల తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అలాగే, వివాహితపై ఫోక్సో చట్టంతో పాటు కిడ్నాప్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments