Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాలిద్వారా మంకీపాక్స్ వైరస్ సోకుతుందా?

dr shankar
, సోమవారం, 25 జులై 2022 (16:44 IST)
మంకీవైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 70కి పైగా ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ కేసులు వెలుగు చూశాయి. వీటిలో భారత్ కూడా ఉంది. మన దేశంలో ఇప్పటివరకు నాలుగు కేసులు వెలుగుచూశాయి. ఈ వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అత్యయిక పరిస్థితిని ప్రకటించింది.
 
అయితే, ఈ వైరస్ గాలిద్వారా సోకుతుందనే భయం ప్రజల్లో ఉత్పన్నమైంది. దీనిపై హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ స్పందించారు. మంకీపాక్స్ లక్షణాలతో తమ ఆస్పత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని తెలిపారు. 
 
తాజాగా ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరగా, అతని నుంచి శాంపిల్స్ సేకరించి పూణెలోని ఎన్.ఐ.వి పరిశోధనాశాలకు పంపించినట్టు చెప్పారు. ఈ రిపోర్టులు మంగళవారం సాయంత్రానికి వస్తాయని తెలిపారు. ఈ వ్యక్తి ఈ నెల 6వ తేదీన కువైట్ నుంచి నగరానికి వచ్చారని తెలిపారు. 
 
మరోవైపు, ఈ వైరస్ గాలిద్వారా వ్యాపిస్తుందంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. అందువల్ల ఈ ప్రచారంపై ప్రజలు భయపడవద్దని ఆయన కోరారు. అయితే, మంకీపాక్స్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు సమచారా ఇవ్వాలని, 6 నుంచి 13 రోజుల్లో ఈ వ్యాది లక్షణాలు బయటపడతాయని డాక్టర్ శంకర్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రారంభమైన ఒప్పో రెనో 8 ఫైవ్‌జీ ఫోన్ విక్రయాలు