మార్స్ (అంగారకుడు) మీద నుంచి చూస్తే భూమి ఎలా ఉంటుందో చూడాలనుకునే వారి కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. "ఈ ఫొటో మనకు ఏదైనా ఒక్కటి నేర్పుతుందంటే.. అది వినయమే" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
అంగారకుడిపై వున్న నాసా 'క్యూరియాసిటీ' రోవర్ దీన్ని తీసింది. "ఈ అద్భుతమైన ఫొటో మార్స్ నుంచి తీసినది. అంగారక గ్రహం.. దీని మీద నుంచి ఓ చిన్న నక్షత్రం మాదిరిగా కనిపిస్తున్నదే మన ప్రియమైన భూగ్రహం" అని నాసా పేర్కొంది.