అగ్నివీరులకు మహీంద్రా గ్రూపు అవకాశం కల్పిస్తుందని ఆ గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. సైనిక నియామకాల కోసం కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద యువత నాలుగేళ్లపాటు దేశానికి సేవ చేయొచ్చు. ఆ తర్వాత వీరికి వివిధ రకాలైన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ కూడా కల్పించనుంది.
అయితే, ఈ పథకం వద్దం సైనిక ఉద్యోగాల భర్తీ కోసం ప్రతియేటా చేపట్టే ఆర్మీ రిక్రూట్మెంట్‌ను చేపట్టాలని దేశంలోని నిరుద్యోగ యువత ఆందోళనలు చేస్తుంది. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ హింసపై ఆనంద్ మహీంద్రా తీవర ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్నిపథ్‌ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తుందన్నారు.
అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్‌లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూపు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఇలాంటి నైపుణ్యం కలిగిన యువతను కార్పొరేట్ సెక్టార్ కోరుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.