Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ సిద్ధాంతాలను మీరితే వెంటనే చర్యలు : ఆనంద్ మహీంద్రా

ఆ సిద్ధాంతాలను మీరితే వెంటనే చర్యలు : ఆనంద్ మహీంద్రా
, బుధవారం, 26 జనవరి 2022 (14:55 IST)
ఇటీవల కర్నాటక రాష్ట్రంలోని తుముకూరులోని మహింద్రా షోరూమ్‌‍లో ఓ రైతుకు జరిగిన అవమానంపై మహింద్రా అండ్ మహీంద్రా సంస్థ యజమాని ఆనంద్ మహీంద్రా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తి గౌరవాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మా భాగస్వాముల అభివృద్ధికి పని చేయడమే మా విధానం అని స్పష్టం చేశారు. తమ సిద్ధాంతాలను మీరితో వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 
కెంపెగౌడకు చెందిన ఓ రైతు బొలెరో పికప్ ట్రక్ కొనుగోలు చేసేందుకు తుముకూరులోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్ళి కారు కావాలని అడిగాడు. దానికి సేల్స్‌మేన్.. నీ జేబులో రూ.10 కూడా ఉండవు రూ.10 లక్షలు కారు కొంటావా?. మొహం చూడు అంటూ హేళనగా మాట్లాడారు. 
 
దీంతో అహం దెబ్బతిన్న ఆ రైతు.. అర్థగంటలో రూ.10 లక్షల డబ్బులు తెచ్చి... అప్పటికప్పుడు ట్రక్‌ను డెలివరీ చేయాలంటూ సేల్స్‌మెన్‌ను డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దిరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను చాలా మంది ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు. 
 
"మా కమ్యూనిటీలో వారు, భాగస్వాముల అభివృద్ధి కోసం పని చేయడమే మహీంద్రా సంస్థ ప్రధాన విధానం. వ్యక్తుల ఆత్మగౌరవాన్ని కాపావడటం మా ప్రధాన విలువ. ఈ సిద్ధాంతాలను రాజీ లేకుండా అమలు చేస్తాం. ఎవరైనా వాటిని మీరినట్టు తేలితో అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్టీసీ బస్సుల్లో చార్జీల తగ్గింపు.. ఎక్కడ?