Publish Date: Fri, 01 Oct 2021 (14:39 IST)
Updated Date: Fri, 01 Oct 2021 (14:41 IST)
ఇడ్లీలంటే భారత దేశ ప్రజలకు మహా ప్రీతి. ఇడ్లీలలో వుండే పోషకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఇడ్లీల చిత్రాన్ని ట్వీట్ చేశారు. ఈ ఇడ్లీలలోనే ప్రత్యేకత వుంది. ఈ ఇడ్లీలను ఐస్ క్రీమ్ స్టిక్‌లపై వడ్డించారు. అంతే ఫోటో వైరల్ అయ్యింది.
బెంగుళూరుకు చెందిన వ్యక్తి ఈ వంటకాన్ని పరిచయం చేశారు. ఐస్ క్రీమ్ స్టిక్‌పై ఇడ్లీ -సాంబార్ మరియు చట్నీ డిప్‌లు గల ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ 15,000 లైక్‌లను సంపాదించింది. ఇంకా 1,400 సార్లు రీట్వీట్ చేయబడింది. ఐస్‌క్రీమ్ స్టిక్‌లపై ఇడ్లీలను అందించాలనే వినూత్న ఆలోచనను చూసి చాలా మంది వినియోగదారులు ఆశ్చర్యపోయారు, మరికొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
"పూర్తిగా వ్యతిరేకం ... ఒంటి చేత్తో ఇడ్లీ తినడం నిజమైన సంప్రదాయం ... ఇది అనారోగ్యం" అని ఒక వినియోగదారు రాశారు. "భారతీయ ఆహారాన్ని చేతులతో మాత్రమే తింటే మంచిది. మరేదైనా నేరమే" అని మరొకరు పంచుకున్నారు.
సెల్వి
Publish Date: Fri, 01 Oct 2021 (14:39 IST)
Updated Date: Fri, 01 Oct 2021 (14:41 IST)