Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిడ్డ శవాన్ని పది కిలో మీటర్ల మేర భుజాలపై మోసిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (19:12 IST)
Roypur
శవాలను తరలించే వాహనం అందుబాటులోకి లేకపోవడంతో తన బిడ్డ శవాన్ని పది కిలో మీటర్ల మేర భుజాలపై మోసుకెళ్లాడు. ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దియో స్పందించి, విచారణకు ఆదేశించారు.
 
వివరాల్లోకి వెళ్తే.. అమ్‌దాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్‌కు సురేఖ(7) అనే కూతురు ఉంది. సురేఖ గత నాలుగైదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. 
 
అయితే శవాలను తరలించే వాహనం అందుబాటులో లేకపోవడంతో, చేసేదేమీ లేక ఈశ్వర్ తన భుజాలపైనే బిడ్డ శవాన్ని 10 కిలోమీటర్ల మేర నడక సాగించి, స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ దియో స్పందించి, విచారణకు ఆదేశించారు.
 
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments