Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవజాత శిశువులకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య 'రక్షణ'

నవజాత శిశువులకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య 'రక్షణ'
, బుధవారం, 23 మార్చి 2022 (17:16 IST)
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బీమా కంపెనీల్లో ఒకటైన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సరికొత్త బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చింది. మహిళతో పాటు గర్భస్థ శిశువుకు కూడా రక్షణ కల్పించేలా ఈ పాలసీని రూపొందించారు. మహిళలకు అన్ని దశల్లో ఉపయోగపడేలా ప్రత్యేకంగా స్టార్ ఉమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చారు. ఆ పాలసీ ప్రయోజనాలను ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.ప్రకాష్ వెల్లడించారు. ఇదే అంశంపై జరిగిన ఓ సదస్సులో ఆయనతో పాటు పలువురు జాతీయ సంస్థలకు చెందిన ప్రాతినిథ్యం వహిస్తున్న వివిధ రంగా నిష్ణాతులు పాల్గొని, ఆరోగ్యం విషయంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. 
 
కొత్తగా ప్రారంభించిన స్టార్ ఉమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ కింద, తల్లులు తమను తాము ఉపయోగించుకోవచ్చని కోరారు. తొలిసారి అన్ని వయసుల వారికి అందించేలా ఈ పాలసీ ఉందన్నారు. ఈ పాలసీ లక్ష్యం జీవితంలోని అన్ని దశలలోని మహిళలకు అన్నీ రకాలుగా రక్షణ కల్పించేలా ఉందన్నారు. 
 
పాలసీ సహాయక పునరుత్పత్తి చికిత్స, ప్రసవానంతర, డెలివరీ ఖర్చులు, గర్భాశయంలోని పిండం వంటి వాటికి కూడా వర్తిస్తుందని తెలిపారు. శస్త్రచికిత్సలు, నవజాత శిశువు చికిత్స కోసం ఆసుపత్రి ఖర్చులు, పుట్టుకతో వచ్చే లోపాల కోసం కవర్, గర్భస్రావం, టీకా ఖర్చులు కూడా చెల్లించేలా ఈ పాలసీ ఉందన్నారు. మెటబాలిక్ స్క్రీనింగ్ కోసం అయ్యే ఖర్చులు కూడా చెల్లిస్తుందన్నారు. మహిళల ఆరోగ్య అవసరాలను అర్థం చేసుకోవడమే కాకుండా, గర్భిణీ స్త్రీలు, పిండం ఆరోగ్యం, నవజాత శిశువు అనారోగ్యం బారినపడినపుడు అయ్యే ఖర్చులు కూడా ఈ పాలసీ కవర్ చేస్తుందన్నారు. 
 
చెన్నైలోని మెడిస్కాన్ సిస్టమ్స్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ శేషాద్రి మాట్లాడుతూ, గుండె సంబంధిత సమస్యలు, ట్విన్ టు ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలు లేదా ఇతర వైద్య పరిస్థితులు సకాలంలో చికిత్స పొందినట్లయితే ఆరోగ్యకరమైన సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఈ పిండం శస్త్రచికిత్సలు ఈ శిశువులకు జీవితం మరియు మరణం మధ్య నిర్ణయాత్మక కారకాన్ని ఏర్పరుస్తాయి.
 
 ఈ విధానాలు తరచుగా ఖరీదైనవి. అందువల్ల చాలా మంది తల్లులు నవజాత శిశువును రక్షించడం కంటే గర్భాన్ని తొలగించడాన్ని ఎంచుకుంటారు. అటువంటి విధానాలకు బీమా కవరేజ్ మహిళలకు ఈ సమయంలో అవసరం. పిండం శస్త్రచికిత్సలో పురోగతితో, ఈ పరిస్థితులలో కొన్ని గర్భధారణ సమయంలో చికిత్స చేయవచ్చు. శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏదేని అనారోగ్య సమస్య తలెత్తినపుడు చేసే వైద్యం ఖర్చులను ఆ తరహా పాలసీలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణా రాష్ట్రంలో కరెంట్ చార్జీల బాదుడు