ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (18:02 IST)
కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. దీంతో గురువారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది. 
 
కరోనా ప్రభావం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విద్య, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ బుధ‌వారం త‌మ విడిది కార్యాల‌యంలో సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సంద‌ర్భంగా క‌రోనా వైర‌స్‌పై చేపట్టిన చర్యలపై వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. ఈ నెల 31 వరకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అనంతరం పరిస్థితిని సమీక్షించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సాక్షి మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నారి నారి నడుమ మురారి

Sushmita: నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు : సుస్మిత కొణిదెల

Rukmini Vasanth: టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌ లో రుక్మిణి వ‌సంత్ లుక్

Dil Raju: బొమ్మరిల్లు 2 తీయాలంటే ఆది, సాయి కుమార్ లతో తీయాలి : దిల్ రాజు

అనసూయ హీరోయిన్ కాదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నూతన సంవత్సరం, నూతన అలవాట్లు: బరువు నియంత్రణలో కాలిఫోర్నియా బాదం కీలక పాత్ర

ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే రాగులతో చేసిన రొట్టెలు తినకుండా వుండరు

వాకింగ్ ఎలా చేస్తే ఆరోగ్యకరం?

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments