Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న ఎన్‌.టి.ఆర్‌ 25వ వర్ధంతి

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (11:08 IST)
మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టాం, ఏ ప్రాంతంలో పుట్టాం, ఏ జాతిలో పుట్టాం అన్నది ముఖ్యం కానే కాదు. కానీ.. ఆ ప్రాంతానికి, ఆ జాతికి మనం ఏమి చేశాం, వారిలో ఎంత స్ఫూర్తిని నింపాం, వారిని ఎంత చైతన్యవంతం చేశాం, వారికి ఎలా దిశానిర్దేశం చూపే మార్గదర్శకులం అయ్యి మరణించాం అన్నది ముఖ్యం. 
 
అటువంటి పుట్టుక, మరణం ఆయాచితంగా ప్రతి ఒక్కరికీ రావు. స్వయాన ఆ దేవుడే తలచుకుని తన దూతగా ఈ విశ్వంలోకి పంపితేనే అది సాధ్యమవుతుంది. అటువంటి కారణజన్ముడు, యుగపురుషుడే.. ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’, ‘నటరత్న’, ‘కళాప్రపూర్ణ’, ‘తెలుగు జాతి ముద్దుబిడ్డ’, ప్రపంచవ్యాప్త తెలుగువారంతా ఆప్యాయంగా పిలుచుకునే 'అన్న' మరియు అభిమానుల పాలిట ‘దైవం’.. స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’గారు. 
 
ఆయన దివ్యమోహన రూపం సాంఘీక చలనచిత్రాల్లో, తాను పోషించిన పాత్రల ద్వారా ఎందరికో స్పూర్తి నివ్వడమేగాక, హైందవ సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలచిన.. మహాభారత, భాగవత, రామాయణాల్లోని పాత్రలకు సజీవ రూపకల్పన చేసి మన కళ్ళముందు కదలాడటమేగాక, ‘తెలుగు భాష’ తియ్యదనాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే ‘తెలుగు పలుకు’లను తన వాక్పటిమతో కొత్తపుంతలు తొక్కించారు.
 
అంతేకాకుండా ‘ఆత్మగౌరవం’ నినాదంతో రాజకీయాల్లోకి ప్రవేశించి, అపరిమితమైన ‘ఆత్మవిశ్వాసం’తో ఢిల్లీ గద్దెతో మడమ తిప్పని పోరాటం చేసి, ‘తెలుగు జాతి’లో ఒక మహత్తర రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ‘తెలుగు’వారి పౌరుషాన్ని దశదిశలా చాటి, అప్పటిదాకా ‘మదరాసీ’లుగా పిలవబడుతున్న ‘తెలుగు జాతి’కి ఓ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ‘తెలుగు జాతి’ని సగర్వంగా ప్రపంచానికి పరిచయమూ చేశారు.
 
ఆ ‘అవిశ్రాంత యోధుడు’ సరిగ్గా 25 ఏళ్ళ కిందట 18, జనవరి 1996న మరో మహత్తర కార్య సాధన కోసమై ఈ భువి నుండీ దివికేగాడు. అప్పటి నుండీ ప్రతీ సంవత్సరం ఇదే రోజున ప్రతీ ‘తెలుగు’వాడూ బాధాతప్త హృదయాలతో, ఆ ‘మహనీయుడు’ని స్మరించుకోవటం అనేది తమ జాతినీ, తమ భాషనీ మరియూ తమని తాము గౌరవించుకున్నట్లగా భావిస్తూ వస్తున్న సందర్భంగా..
 
జోహార్ ‘నటరత్నం’..
జోహార్ ‘తెలుగుతేజం’..
జోహార్ ‘విశ్వవిఖ్యాతం’..
జోహార్‌ ‘ఎన్‌. టి. ఆర్‌’..
అంటూ మరొక్కసారి ఎలుగెత్తి చాటాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
 
‘ఆయన’ వీరాభిమాని,
వై వి ఎస్ చౌదరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments