Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిత్తూరులో జల్లికట్టు.. ఎన్టీఆర్ ఫోటోలు అదుర్స్.. ఫోటోలు వైరల్

Advertiesment
చిత్తూరులో జల్లికట్టు.. ఎన్టీఆర్ ఫోటోలు అదుర్స్.. ఫోటోలు వైరల్
, బుధవారం, 13 జనవరి 2021 (15:22 IST)
సంక్రాంతి సందడిలో అందరికీ కోడి పందాల ఆట గుర్తుకు వస్తుంది. కానీ తెలుగు ఏపీలోని చిత్తూరు జిల్లాలో మాత్రం సంక్రాంతి అంటే అక్కడ జల్లికట్టు అనే సంబరాన్ని గుర్తుతెచ్చుకుంటారు. తమిళనాడు రాష్ట్రంలో సరిహద్దు పంచుకోవడం వల్లనో ఏమో కానీ చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు తమిళనాడు సాంప్రదాయమైన జల్లికట్టు క్రీడను ఇక్కడ నిర్వహించడం ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తోంది. 
 
నిజానికి తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో ఎద్దులను మచ్చిక చేసుకుని. లొంగ దీసుకొనే ఒక ఆటే జల్లికట్టు. జల్లికట్టులో ఎద్దులను చంపరు. మచ్చిక చేసుకోవాలనుకొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ నాడు దీనిని నిర్వహిస్తారు. చిత్తూరు జిల్లాలో సాంప్రదాయ జల్లికట్టు ఆట. ఈసారి భోగికి ముందే మొదలుపెట్టేశారు. మొన్న చంద్రగిరి మండలం కొత్తశానం బట్లలో జల్లికట్టు నిర్వహించారు. 
 
ఈ జల్లికట్టు వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు మెరిసిపోయాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో ఆయన అభిమానులు సందడి చేశారు. పోట్లగిత్తల కొమ్ములకు ఎన్టీఆర్ ఫొటోలను పెట్టి.. మురిసిపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం అనుప్పల్లిలో చోటుచేసుకుంది. జల్లికట్టు వేడుకలలో పాల్గొనే పోట్లిగిత్తలను అందంగా ముస్తాబు చేసారు. వీటిలో కొన్నిటి కొమ్ములకు ఎన్టీఆర్ ఫొటోలను పెట్టారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
ఇదిలా ఉంటే, జల్లికట్టును చూసేందుకు యువత భారీగా తరలివచ్చింది. పోట్లగిత్తల కొమ్ములు వంచటానికి కుర్రకారు ఆసక్తి చూపారు. బ్రాహ్మణపల్లి, నెమలిగుంటపల్లి, ఉప్పులవంక, గంగిరెడ్డిపల్లి, యాపకుప్పం, చంద్రగిరి, చానంబట్ల, పాతచానంబట్ల, చవటగుంట తదితర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జల్లికట్టును తిలకించటానికి విచ్చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా కీలక నిర్ణయం.. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ వుంటేనే..?