Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

అమెరికా కీలక నిర్ణయం.. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ వుంటేనే..?

Advertiesment
Covid-19
, బుధవారం, 13 జనవరి 2021 (15:16 IST)
అమెరికా.. అంతర్జాతీయ ప్రయాణికుల విషయమై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో.. ఇకపై తమ దేశంలోకి ప్రవేశించాలంటే ప్రయాణికులకు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని పేర్కొంది. అది కూడా ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న సర్టిఫికేట్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. 
 
జనవరి 26 నుంచి ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) పేర్కొంది. అయితే, రెండేళ్లలోపు వయసు గల చిన్నారులు, విదేశాలకు కాకుండా దేశంలోనే ఒకచోటు నుంచి మరో చోటికి ప్రయాణించేవారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. 
 
కానీ, ఇతర దేశాల నుంచి స్వదేశానికి వచ్చే అమెరికన్లకు కూడా ఈ ఆంక్షలను వర్తింపజేయనున్నట్లు సీడీసీ డైరెక్టర్ మార్క్ రెడ్‌ఫీల్డ్ వెల్లడించారు. కెనడా కూడా అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ నెల 7వ తేదీ నుంచి ఇలాంటి ఆంక్షలను విధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెండే కదా నమ్మి వెంట నడిస్తే.. నలుగురితో అత్యాచారం చేయించాడు..