Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు..

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (16:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వారిపై ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్‌ నిర్ధారణకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించింది. ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి క్వారంటైన్‌ గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
 
ఇందులో భాగంగా కోవిడ్‌ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండాలని సూచించింది. మిగిలిన వారు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని పేర్కొంది.

అలాగే, రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు 72 గంటల ముందు కోవిడ్‌ నెగెటివ్‌ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త మార్గదర్శకాలు అమలులోకి తీసుకువచ్చినట్లు ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది..

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments