Webdunia - Bharat's app for daily news and videos

Install App

మౌత్ వాష్‌లను ఆర్డర్ చేస్తే.. రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్ వచ్చిందోచ్!

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (16:50 IST)
Redmi Note 10
ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి మనం ఆర్డర్ చేసే వస్తువులే మనకు డెలివరీ అవుతుంటాయి. కానీ కొన్ని సార్లు జరిగే పొరపాట్ల వల్ల మనం ఆర్డర్ చేసే వస్తువులు కాకుండా వేరే వస్తువులు వస్తుంటాయి. 
 
తాజాగా ముంబైకి చెందిన లోకేష్ దాగా అనే వ్యక్తి మే 10వ తేదీన అమేజాన్‌లో 4 కోల్గేట్ మౌత్ వాష్‌లను ఆర్డర్ చేశాడు. వాటి ధర రూ.396. అయితే అతనికి మౌత్ వాష్‌లకు బదులుగా రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్ వచ్చింది. అతను బాక్స్‌ను ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు. 
 
తాను మౌత్ వాష్‌లను ఆర్డర్ చేస్తే ఫోన్ వచ్చిందేమిటబ్బా అని కంగారు పడ్డాడు. వెంటనే తేరుకుని ఇన్‌వాయిస్ చూడగా వేరే వాళ్లకు వెళ్లాల్సిన ఇన్‌వాయిస్ ఉంది. కానీ అడ్రస్ మాత్రం అతనిదే ఉంది. 
 
అయితే ఈ విషయాన్ని అతను ట్విట్టర్ ద్వారా అమెజాన్‌కు తెలిపాడు. తాను మౌత్ వాష్‌లను ఆర్డర్ చేస్తే రెడ్‌మీ నోట్ 10 ఫోన్ వచ్చిందని, మౌత్ వాష్‌లు కన్‌జ్యూమబుల్స్ కనుక వాటిని రిటర్న్ పంపేందుకు ఆప్షన్ లేదని, కనుక అమేజాన్ స్పందించి ఆ ఫోన్ ఎవరికైతే చేరాలో వాళ్లకి దాన్ని చేర్చాలని చెప్పాడు. 
 
అయితే అమేజాన్ ఇంకా స్పందించలేదు. కానీ నెటిజన్లు మాత్రం చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. చీఫ్ ధరకు ఫోన్ వచ్చింది కదా, దగ్గర పెట్టుకో అని అంటున్నారు. ఇక ఆ ఫోన్ ఖరీదు దాదాపుగా రూ.13వేల వరకు ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments