Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలియుగంలో కర్ణుడి తరహా ఘటన.. గంగానది.. పెట్టెలో శిశువు.. షాకింగ్ న్యూస్!

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (12:10 IST)
Baby born
మహాభారతంలో కర్ణుడుని తల్లి కుంతీదేవి ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసిన ఘటన గురించి తెలిసిందే. అది ఆ కాలం నాటి మాట. కానీ కలియుగంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుందంటే నమ్ముతారా.. నమ్మితీరాల్సిందే. యూపీలో ఓ చంటిబిడ్డను ఓ చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ చెక్కపెట్టెలో చంటిబిడ్డతో పాటు కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కూడా ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తుండటంతో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. చుట్టూ చూశాడు. ఎక్కడా చంటిబిడ్డ జాడలేదు. కానీ ఏడుపులు మాత్రం వినిపిస్తున్నాయి. దీంతో పరిశీలించి చూడగా.. నదిలో ఓ చెక్కపెట్టె కొట్టుకువస్తుండటం చూశాడు. ఆ పెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తున్నాయని గ్రహించాడు. నదిలోంచి ఆ పెట్టెను ఒడ్డుకు తీసుకొచ్చి తెరిచి చూడగా.. షాక్ అయ్యాడు. 
 
ఆ చెక్కపెట్టెలో ఓ ఎర్రని వస్త్రం మీద ఆడబిడ్డను పడుకోబెట్టి.. దేవతా పఠాన్ని కూడా పెట్టి ఉంది. ఆ బిడ్డ వయస్సు నెలరోజుల లోపు ఉంది. నావికుడి కేకలు విన్న స్థానికులు పలువురు అక్కడి చేరుకున్నారు. ఆ పెట్టెలో ఉన్న బిడ్డను చూసి అవాక్కయ్యారు. ఆ పెట్టెలో కనకదుర్గమ్మ వారి ఫోటోతో పాటు ఓ పేపర్ కూడా ఉంది. ఆ పేపర్‌లో ఆ బిడ్డ పుట్టిన జాతకం ప్రకారం..ఆ బిడ్డకు 'గంగ' అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. 
 
కాగా పెట్టెలో దొరికిన ఆడబిడ్డను గుర్తించిన నావికుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ బిడ్డను నాకు గంగమ్మే ఇచ్చింది. ఆ బిడ్డ పేరు కూడా గంగ అని రాసి ఉంది. ఇది నా అదృష్టం అని మురిసిపోయాడు. ఈ బిడ్డను నేను పెంచుకుంటానని చెప్పాడు.
 
కానీ గంగానదిలో స్థానికుడి ఓ పెట్టె దొరికిందని ఆ పెట్టలో ఆడ శిశువు ఉందని స్థానికులు పోలీసులకు తెలియజేయటంతో బిడ్డ దగ్గరకొచ్చిన పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను ఆశాజ్యోతి కేర్ సెంటర్‌కు తరలించారు. కాగా.. గంగానదిలో పెట్టెలో ఓ చంటిబిడ్డ కొట్టుకొచ్చిందనే వార్త స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ టాపిక్ పెద్ద చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments