ఆరేళ్ల బాలిక బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె కోజికోడ్‌కు చెందిన ఆరేళ్ల మెహక్ ఫాతిమా. ఇంత చిన్న వయసులోనే తన అసాధారణ ప్రతిభతో పలువురి ప్రశంలందుకుంటోంది. ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఈ చిన్నారిని ప్రతిభకు ముగ్ధులైపోయారు.
ఇదిగో మరో ఫ్యూచర్ సూపర్ స్టార్‌ను చూడండి అంటూ ఆమె వీడియోను పోస్టు చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ అమ్మాయిపై ఓసారి దృష్టి సారించండి.. ఈమె ప్రతిభను వృధాకానివ్వకండి అంటూ కేంద్ర క్రీడాశాఖమంత్రి కిరణ్ రిజుజుకి టాగ్ చేశారు.
ది బెటర్ ఇండియా ఈ చిచ్చర పిడుగును ట్విటర్ వేదికగా పాతిమా టాలెంట్‌ను పరిచయం చేసింది. అలాగే ఇన్‌స్టా అకౌంట్‌లో కూడా మెహక్ పాతిమా విశేషాలు వీడియోలున్నాయి. ఫాతిమా తన తండ్రి తన కంటే మూడేళ్లు చిన్నవాడైన తమ్ముడికి క్రికెట్ నేర్పిస్తుండగా జాగ్రత్తగా పరిశీలించింది. బ్యాటింగ్‌తో అదరగొట్టింది. తమ్ముడితో పాటు తనకు కూడా క్రికెట్ నేర్పమని తండ్రిని డిమాండ్ చేసింది. దీంతో ఆయన ఫాతిమాకు కూడా నేర్పించసాగారు.
ఆమె నేర్చుకున్న తీరుకు స్వయానా తండ్రే ఆశ్యర్యపోయాడు. ఇక ఫాతిమా ప్రాక్టిసు చేస్తున్న వీడియో చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోకు పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే 31 వేలకు పైగా వ్యూస్ లభించాయి.
ఇకపోతే.. ఫాతిమా తండ్రి మునీర్ క్రికెటర్ కావడం విశేషం. మునీర్ తన 13 ఏళ్ళ వయసులోనే కాలికట్ విశ్వవిద్యాలయం జట్టు తరపున ఆడారట. ఇక ఫాతిమా సోదరుడు 18 నెలల వయసులో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. భవిష్యత్తులో తను మంచి క్రికెటర్ కావాలనుకుంటోందనీ, స్మృతి మంధన అంటే ఎంతో ఇష్టమని, ఆమెను ఫాలో అవుతూ, ఆమెలాగే ఆడాలని ప్రయత్నిస్తుందని ఆమె తల్లిదండ్రులు చెప్తున్నారు. అదన్నమాట సంగతి.