పెళ్లి చేసుకోవాలనుకున్న యువత అసలు తాము పెళ్లి ఎందుకు చేసుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటున్నారు. పూరీ కాన్సెప్ట్ పేరుతో పూరీ మ్యూజింగ్స్ అంటూ తన వాయిస్‌ను ఆయన వినిపిస్తున్నారు. సోషల్‌మీడియా పెట్టి అందరినీ ఏదో ఒక విషయంలో ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పెండ్లి విషయంలో తనకు తెలిసిన విషయాలు వెల్లడించారు.
కొత్తగా పెళ్లయిన ఓ జంట హనీమూన్‌కు మాల్దీవ్‌లకు వెళ్ళారు. రేపు తిరిగి వద్దానుకుని వుండగా కోవిడ్ వల్ల లాక్‌డౌన్ బ్రేక్ చేసింది. అలా నాలుగు నెలలు అక్కడే వుండాల్సి వచ్చింది. ఆ తర్వాత తిరిగి వచ్చి ఇద్దరూ విడాకులకు అప్లయి చేశారు. ఇలా ఎన్నో కథలు కోవిడ్‌లో చూశాననీ ఆయన తెలియజేస్తున్నాడు. ముంబై, ఢిల్లీలోనే భారీగా విడాకుల కేసులు నమోదు అవుతున్నాయని చెబుతున్నారు. మామూలుకంటే కోవిడ్ టైంలో యు.ఎస్., చైనాలలో 2శాతం విడాకుల శాతం పెరిగిందన్నారు. ఇక ఇండియాలో ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, ఛతీస్‌ఘడ్, బెంగాల్, కేరళలో విడాకుల కేసులు ఎక్కువయ్యాయని విశ్లేషించారు.
ఇక ముంబైలో అయితే రోజుకు 25 కేసులు ఇలాంటి వస్తున్నాయని పేర్కొన్నాడు. ఇక గోవాలో మరీ విపీరతం అందుకే అక్కడి ప్రభుత్వం ఇటీవలే ఓ రూల్ పెట్టింది. పెళ్లిచేసుకునే జంటకు ముందుగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. తాముఎందుకు పెళ్లి చేసుకోవాలో తెలిపాలి. అలాంటి రూల్ దేశమంతా రావాలి. ఒకవేళ వివాహం చేసుకుంటే ఇద్దరూ ఉద్యోగం చేసి వుండాలి. రాబోయే కాలంలో అంటే 2040లో 50 పైబడిన వారంతా చనిపోతారు. మేరేజ్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అసలు పెల్లి కేవలం ఒంటరితనం భరించలేక చేసుకుంటున్నట్లు సర్వేలో తేలింది. కానీ పెల్లయ్యాక చాలా మంది బతుకులు ఒంటరివే అంటూ జోక్యం చెప్పారు. అందుకేమో వందల ఏళ్ళనాడే బుద్ధుడు, జీసెస్ పెళ్లి వద్దన్నారు కానీ మనమే వినలేదు అంటూ వివరించారు.
ఇప్పటి కోవిడ్ పరిస్థితుల్లో భార్యాబర్తలు కలిసివుంటే అర్థగంట సేపు కన్నా ఎక్కువగా మాట్లాడుకోవద్దు. టీవీ చూడండి. వాట్సప్ చూసుకోండి. లేదా అటుతిరిగి పడుకోండని సూక్తులు వల్లించారు. ఇదంతా కొత్త జనరరేషన్ కోసమే అంటున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో.