Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24 ఏళ్ల మగువ.. లారీ డ్రైవర్‌గా మారింది.. ఆమెను చూసి వారు షాకయ్యారు..?

24 ఏళ్ల మగువ.. లారీ డ్రైవర్‌గా మారింది.. ఆమెను చూసి వారు షాకయ్యారు..?
, సోమవారం, 14 జూన్ 2021 (17:21 IST)
Delisha Davis
24ఏళ్ల మగువ పురుషులకు ధీటుగా లారీ డ్రైవింగ్ చేస్తోంది. పురుషులకు పోటీగా లారీని నడుపుతోంది. వివరాల్లోకి వెళితే.. 4 ఏళ్ల ఆ అమ్మాయి పేరు దెలిషా డేవిస్.. చదివింది ఎంకామ్. కానీ ఏదో ప్రైవేట్ జాబ్‌ను ఎంచుకోకుండా లారీ డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుంది. వివరాల్లోకి వెళితే..  కేరళలోని త్రిసూర్‌కు చెందిన దెలిషా 300 కిలోమీటర్ల పాటు అలుపు సొలుపు లేకుండా డ్రైవింగ్ చేస్తూ, వృత్తిని ఎంతో ఆస్వాదిస్తోంది. 
 
తొలుత టూ వీలర్ నడపడం నేర్చుకున్న దెలిషా, ఆపై ఫోర్ వీలర్ డ్రైవింగ్ ను కూడా నేర్చేసుకుంది. ఈ క్రమంలో తన తండ్రి నడిపే పెట్రోల్ ట్యాంకరు డ్రైవింగ్‌ను కూడా కొద్దికాలంలోనే వంటబట్టించుకుంది. 16 ఏళ్ల వయసులోనే దెలిషా లారీ నడిపిందంటే ఆమె నైపుణ్యం, తపన ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. మల్టీయాక్సిల్ వోల్వో బస్సు నడపాలన్నది దెలిషా కల. అందుకు వీలుగా ప్రత్యేక లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించింది. 
 
ఆమె తండ్రి పీఏ డేవిస్ లారీ డ్రైవర్ కావడంతో, దెలిషా ఆ దిశగా ఆసక్తి పెంచుకుంది. డేవిస్ కూడా ఎంతో ధైర్యంతో తన కుమార్తెను డ్రైవింగ్ చేసేందుకు ప్రోత్సహించారు. దెలిషా వారానికి మూడు పర్యాయాలు ఓ పెట్రోల్ ట్యాంకరును కొచ్చి నుంచి మళప్పురం వరకు తీసుకెళ్లి మళ్లీ తిరిగొస్తుంది. 
 
ఇరుంబనం వద్ద ఉన్న ఆయిల్ రిఫైనరీ నుంచి చమురును తిరూర్ ‌ని ఓ పెట్రోల్ బంకుకు ట్యాంకరు ద్వారా తరలించడం ఆమెకు ఎంతో ఇష్టమైన పనిగా మారింది. గత మూడేళ్లుగా దెలిషా కేరళ రోడ్లపై తన ట్యాంకరు లారీని పరుగులు పెట్టిస్తోంది. 
webdunia
woman
 
ఓసారి రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, దెలిషా లారీని కూడా ఆపారు. డ్రైవింగ్ సీట్లో అమ్మాయిని చూసి వారు విస్మయానికి గురయ్యారు. అమ్మాయి అయినప్పటికీ నిబ్బరంగా లారీ నడుపుతున్న తీరు చూసి అధికారులు సైతం ఆమెను అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలసీ హోల్డర్లకు అత్యధికంగా 867కోట్ల రూపాయల బోనస్‌ను ప్రకటించిన ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌