Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూగ యువతిపై సామూహిక అత్యాచారం.. సెల్ ఫోనులో వీడియో తీసి..?

Advertiesment
Deaf girl
మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మూగ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. శంభునిపేటలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మూగ యువతి తన తల్లి మరణంతో అమ్మమ్మ ఇంట్లో తండ్రితో పాటు ఆశ్రయం పొందుతోంది.

ఆదివారం మధ్యాహ్నం తండ్రి పనికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లోకి చొరబడిన ముగ్గురు నిందితులు మూగ యువతిపై లైంగిక దాడికి పాల్పడుతూ సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రికరించినట్లు తెలుస్తోంది.
 
ఇంట్లో ఉన్న యువతి ఆమ్మమ్మకు కళ్లు కనిపించవు. చొరబడిన ముగ్గురిలో ఒకరు వృద్ధురాలి వద్ద కాపలా ఉండి మిగతా వారు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసింది. నిందితులు ముగ్గురూ అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో పథకం ప్రకారం ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.
 
నిందితులు తీసిన వీడియో పోలీసులకు చిక్కినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి రాగానే విలపిస్తున్న కూతురుని చూసిన తండ్రి ఏమి జరిగిందని అడగ్గా.. విషయం చెప్పడంతో మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

43 మంది అబ్బాయిలు. 21 మంది అమ్మాయిలు.. మస్తుమజాగా రేవ్ పార్టీ... ఎక్కడ?