అన్నాడీఎంకే సభ్యుల ఆందోళన.. లోక్‌సభ వాయిదా : సీఎం రమేష్ రాజీనామా

లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే, సభాపతి సుమిత్రా మహాజన్ తన స్థానంలోకి రాకముందు నుంచే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు.

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (11:32 IST)
లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే, సభాపతి సుమిత్రా మహాజన్ తన స్థానంలోకి రాకముందు నుంచే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. 'వీ వాంట్ కావేరో వాటర్ బోర్డు' అంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా అన్నాడీఎంకే సభ్యులు పట్టించుకోలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
 
మరోవైపు, తన రాజ్యసభ సభ్యత్వానికి సీఎం రమేష్ రాజీనామా చేశారు. గతంలో ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏపీ నుంచి సీఎం రమేష్‌ పెద్దల సభకు ఎన్నికయ్యారు. సాంకేతిక కారణాల దృష్ట్యా రెండు ప్రాంతాల్లో ఆయన ఎంపీగా కొనసాతున్నారు. ఏప్రిల్‌ 2తో తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎంపీ పదవీకాలం ముగియనుండటంతో రమేష్ బుధవారం తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments