అవిశ్వాసానికి సిద్ధమవుతున్న ఎన్డీయే.. మంగళవారం చర్చ సాగుతోందా?
అవిశ్వాసానికి కేంద్ర ప్రభుత్వం జడుసుకుంటోందని ఆరోపణలు రావడంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి చర్చ జరగకుండా కేంద్రం అడ్డుకుంటోందని వస్తున్న విమర్శల నేపథ్యంలో, తమకు
అవిశ్వాసానికి కేంద్ర ప్రభుత్వం జడుసుకుంటోందని ఆరోపణలు రావడంతో కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి చర్చ జరగకుండా కేంద్రం అడ్డుకుంటోందని వస్తున్న విమర్శల నేపథ్యంలో, తమకు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి చర్చకు వెళ్లడమే సరైందని బీజేపీ కార్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎన్డీయే సర్కారు నిర్ణయించింది.
చర్చకు సిద్ధం కావాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించడంతో మంగళవారం అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం అసోంలోని గువాహటిలో ఓ ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో అవిశ్వాసం తీసుకురావాల్సిందిగా సవాలు విసరడం అందులో భాగమేనని చెప్తున్నారు. అలాగే ఈ సమావేశాల్లో ఆందోళన చేస్తున్న తెరాస, అన్నాడీఎంకేలకు నిర్దిష్ట హామీ కూడా ఇవ్వనున్నట్లు తెలుపుతున్నారు.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై చేసే పోరాటంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందించారు. అసత్యాలు ప్రచారం చేసే నాయకులు చాలామంది ఉన్నారని, అది వారికి అలవాటుగా మారిందని, రాష్ట్రాలకు నిధులిస్తూ సహకరిస్తున్నట్లు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని.. కేంద్ర సర్కారు ఇలా చేయడం నకిలీ సమాఖ్య విధానానికి నిదర్శనమని చెప్పారు.