Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు.. అమిత్ షా గారూ... త్వరలో లేఖ రాస్తాం: నారా లోకేష్

ఎన్డీయే నుంచి వైదొలగడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని తప్పుబట్టిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. రాజకీయ కారణాల నేపథ్యంలోనే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిందంటూ

Advertiesment
ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు.. అమిత్ షా గారూ... త్వరలో లేఖ రాస్తాం: నారా లోకేష్
, శనివారం, 24 మార్చి 2018 (15:21 IST)
ఎన్డీయే నుంచి వైదొలగడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని తప్పుబట్టిన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. రాజకీయ కారణాల నేపథ్యంలోనే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వెళ్లిపోయిందంటూ లేఖలో చెప్పిన అమిత్ షా వ్యాఖ్యలను నారా లోకేష్ ఖండించారు. రాజకీయ లబ్ధితో ముందుకు వెళ్తున్నది టీడీపీ కాదని, బీజేపీనేనని చెప్పారు. 
 
రాజకీయ కారణాలతోనే ఏపీకి కేంద్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందించట్లేదని ఫైర్ అయ్యారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని... యుటిలైజేషన్ సర్టిఫికెట్లకు 19 హామీలను నెరవేర్చకపోవడానికి సంబంధం ఏమిటని నారా లోకేష్ అడిగారు. ఏపీ సమస్యలపై అమిత్ షాకు అవగాహన కూడా లేదనే విషయం ఆయన రాసిన లేఖను బట్టే అర్థం చేసుకోవచ్చునని తెలిపారు. 
 
అన్ని వివరాలను పొందుపరుస్తూ.. త్వరలోనే కేంద్రానికి ఏపీ సర్కారు లేఖ రాస్తుందని నారా లోకేష్ చెప్పారు. ప్రభుత్వం సమర్పించిన యూసీ వివరాలన్నింటినీ లేఖలో పొందుపరుస్తామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. 
 
యూసీలు సమర్పించడంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో వుందన్న విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. అలాంటప్పుడు యూసీలను ఏపీ ఇవ్వలేదని ఆరోపణలు చేయడం ఏమిటన్నారు. ఎన్డీయే నుంచి బయటకు రావాలనే నిర్ణయాన్ని ఆవేశంలో తీసుకోలేదని.. కేంద్ర సర్కారు వైఖరి వల్లే తీసుకున్నామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... ఏ పార్టీ నుంచి?