Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... ఏ పార్టీ నుంచి?

ఉన్నట్లుండి ఒక అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఖచ్చితంగా చర్చ అనేది జరుగుతుంది. ఇదే చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోను జరుగుతోంది. రాజీనామా విషయం పక్కనబెడితే ఏకంగా రాజకీయ పార్టీలోకే వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసేసుకున్

Advertiesment
JD Lakshmi Narayana
, శనివారం, 24 మార్చి 2018 (15:11 IST)
ఉన్నట్లుండి ఒక అధికారి తన ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేస్తే ఎలా ఉంటుంది. ఖచ్చితంగా చర్చ అనేది జరుగుతుంది. ఇదే చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోను జరుగుతోంది. రాజీనామా విషయం పక్కనబెడితే ఏకంగా రాజకీయ పార్టీలోకే వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసేసుకున్నారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఆయన్ను కొన్ని పార్టీలో తమ పార్టీలోకి పిలుచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే లక్ష్మీనారాయణ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఎలాగంటారా... లక్ష్మీనారాయణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు గాలి జనార్థన్ రెడ్డి కేసుల్లో నిజాయితీగా పనిచేసిన జె.డీ. లక్ష్మీనారాయణ అంటే అందరికీ బాగా తెలుసు. ఆ తరువాత బదిలీపై వెళ్ళిపోయారు. కానీ అప్పుడప్పుడు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేవారు. రాజకీయాల గురించి మాత్రం అస్సలు మాట్లాడేవారు కాదు. కానీ సడెన్‌గా ఆయన తన ఉద్యోగానికి రాజీమానా చేసి వచ్చేశారు. 
 
కారణం రానున్న ఎన్నికలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హస్తినలో ఇప్పటికే అధికారం చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్మీనారాయణను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎపి ఎన్నికల్లో నిలబెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ స్వయంగా లక్ష్మీనారాయణతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. పార్టీని అన్ని విధాలుగా నడిపించగల సత్తా ఉన్న వ్యక్తి లక్ష్మీనారాయణ కాబట్టి ఆయన్ను ఎపిలో నియమించి ఆ తరువాత కొంతమంది నేతలను తీసుకునే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఎపిలో రాజకీయాలు మారిపోతాయంటున్నారు విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏంటీ... మీకు ఫేస్ బుక్ అకౌంట్ లేదా? భాజపా ఎంపీలకు నరేంద్ర మోదీ క్లాస్