Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ 5 కోట్లు ఖర్చు పెట్టి ఆ రెండు మున్సిపాలిటీలను ఎగరేసుకుపోయిన రోజా? (video)

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (14:19 IST)
మునిసిపల్ ఎన్నికలు ముగిశాయి. వైసిపి దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. రాష్ట్రంలో వైసిపికి తిరుగే లేదని మరోసారి నిరూపించుకున్నారు వైఎస్ జగన్. ఎన్నికల ఫలితాల పట్ల జగన్ ఫుల్ జోష్‌లో వున్నారు. తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి పాలైంది.
 
ఇదిలావుంటే.. వైసిపి ఎమ్మెల్యే, ఏపిఐఐసి చైర్మన్ రోజా చిత్తూరు జిల్లాలోని పుత్తూరు, నగరి మున్సిపాలిటీల విజయం కోసం తీవ్రంగా కృషి చేసారు. ఆ రెండు చోట్లా రోజా సవాలుగా తీసుకుని రూ. 5 కోట్ల వరకూ ఖర్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. సొంత పార్టీలోనే రెబల్స్ వీరవిహారం చేసినప్పటికీ రోజా మాత్రం ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు.
 
భారీ విజయం నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు రోజా తాడేపల్లికి వెళ్లారు. ఐతే ఆమె మంత్రి పదవి కోసం వచ్చారని ప్రచారం జరుగుతోంది. జగన్ మొదట్లో చెప్పినట్లుగా రెండున్నరేళ్లకు ఒకసారి పాత మంత్రులను తొలగించి ఆ స్థానంలో కొత్తవారిని నియమిస్తానని చెప్పారు.
 
ఈ ప్రకారం చూస్తే త్వరలో రోజాకి మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు. దీనికి బలాన్ని చేకూర్చే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు రోజా వెళ్లడం కనిపిస్తోంది. ఐతే కొందరు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు. కేవలం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపేందుకు రోజా వెళ్లారని అంటున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments