Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజా... ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసు

Advertiesment
రోజా... ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసు
, సోమవారం, 8 మార్చి 2021 (18:01 IST)
ముల్లును ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్న సామెత ఉంది. ఆ సామెతను తూచా తప్పకుండా పాటిస్తోంది ఎపిఐఐసి ఛైర్ పర్సన్, సినీనటి రోజా. తనకు శత్రవులుగా ఉన్న వారిని దగ్గరకు చేర్చుకుని మిత్రులుగా మార్చేసుకుంటుంది. పార్టీలో విభేదాలు ఉండడం.. అందులోను ఎమ్మెల్యేల మధ్య ఉండడం పెద్ద చర్చకే దారితీసింది.
 
తన సొంత నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఉండటం.. ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తుండటం.. తనకు తెలియకుండా పర్యటనలు చేయడం రోజాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదే గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలకు కారణమయ్యాయి. 
 
పార్టీలో దీనిపై పెద్ద చర్చే జరిగింది. అయితే మహిళా దినోత్సవం రోజు రోజా పుత్తూరులోని నారాయణస్వామి ఇంటికి వెళ్ళారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని వెంటబెట్టుకుని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 
 
ఇద్దరు కలిసి ఒకే ప్రచార రథంపై ఎక్కి ప్రచారాన్ని నిర్వహించారు. ఇద్దరి ప్రచారం చూసిన పార్టీ కార్యకర్తలే ఆశ్చర్యపోయారు. అభివృద్ధి, సంక్షేమం చూసి వైసిపికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. దీంతో ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి రోజా అంటూ డైలాగ్‌లు అందుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికలకు చాక్లెట్లు ఇచ్చి అశ్లీల చిత్రాలు చూపించే ప్రబుద్ధుడు.. ఎక్కడ?