ఈమధ్య రాజకీయనాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. బజ్జీలు వేసే వాడి దగ్గరకు వెళ్ళి బజ్జీలు వేస్తారు. ఐరన్ చేసే అతని దగ్గరకు వెళ్ళి ఐరన్ చేస్తారు. సెలూన్‌కు వెళ్ళి గెడ్డం గీసే పని చేస్తారు. ఇలా రకరకాల వ్యక్తుల్ని కలిసినప్పుడు అలా బిల్డప్ ఇస్తారు. ఇవి సినిమా బాషలో చెప్పాలంటే బిల్డప్ షాట్స్ అన్నమాట.
నటి రోజా ఇలాంటి పనే చేశారు. ఎం.ఎల్.ఎ.గా వుంటూ అక్కడ ప్రజలకు ఏమి పనులు చేస్తున్నారో కానీ టీవీ షోలో మాత్రం వారంవారం అలరిస్తున్నారు. తాజాగా ఆంధ్రలో ఎన్నికల హడావుడి వుంది. కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారంనాడు తన నియోజకవర్గ పరిధిలోకి వెళ్ళి అక్కడ కబడ్డీ ఆటగాళ్ళను ఉత్సాహపరిచారు. ఆమె కూడా కబడ్డీ అంటూ కూత పెట్టి ఆడుతుండే చూడాల్సిందే మరి. జనాలు విపరీతంగా వచ్చి ఆస్వాదించారు.
వివరాల్లోకి వెళితే, ఏపీఐఐసీ చైర్మన్, ఎమ్మెల్యే కూడా అయిన రోజా ఆదివారం నిండ్రలో అంబేడ్కర్ కబడ్డీ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన అనంతరం ఆ క్రీడాకారులతో కబడ్డీ ఆడి అందరికి షాక్ ఇచ్చారు.
రోజా కబడ్డీ ఆడడం చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కబడ్డీ ఆడడం చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేదని ఆమె అన్నారు. దాంతో అక్కడున్నవారు... అంతేమరి, మనం కూడా చిన్నప్పుడు ఏ ఆటలు ఆడినా అది చూసినప్పుడు మన కాళ్లు ఆగవు. అలాగే రోజాగారు కూడా అనుకున్నారు.