పెళ్లి, సహజీవనంలో ఉన్న రెండు జంటల కథతో రూపొందిన చిత్రం``మ్యాడ్`. ఓ అమ్మాయి వేసే పెయింటింగ్ చూసి ముచ్చటపడిన అబ్బాయి పెద్దల అంగీకారంతో ఆ అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. మొదటిరాత్రి నాడు శృంగారానికి సిద్ధమవుతుండగా మేరేజ్ ఈజ్ నాంట్ లైసెన్స్ టు ఫక్ అంటూ అబ్బాయికి క్లాస్ పీకుంది. దాంతో తాను రేపిస్ట్‌లా వున్నానా! అంటూ స్నేహితుడితో షేర్ చేసుకుంటాడు. మరి ఆ స్నేహితుడు లైఫ్ చాలా సరదాగా వుంటుంది. సహజీవనం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మరి ఆ జంటకు బ్రేక్ వస్తుంది. అది ఏమిటి? ఎలా అనేది? `మ్యాడ్` సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇటీవలే విడుదలైన మ్యాడ్ ట్రైలర్ అనూహ్యస్పందన వస్తోంది. ట్రెండ్‌లో సాగుతోంది. ఇది ఇప్పటి జనరేషన్ ఆలోచనలకు ప్రతిబింబంగా నిర్మాతలు చెబుతున్నారు. త్వరలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అసలు మ్యాడ్ అంటే, ఇదేదో పిచ్చి అని అర్థంకాదు. మేరేజ్ అండ్ డివోర్స్ అని అర్థం అని అది సినిమాలో తెలుసుకోవాలని చెబుతున్నాడు.
ట్రైలర్‌లోనే సినిమాకు కావాల్సినంద స్టఫ్‌ను దర్శక నిర్మాతలు ఇచ్చేశారు. బయట, స్విమ్మింగ్ ఫూల్‌లోనూ ముద్దు సీన్లు పెట్టేశారు. ఇవి కథనం ప్రకారం సాగుతాయని నిర్మాతలు చెబుతున్నారు. మరి ఈనెలాఖరున విడుదల తర్వాత ఈ చిత్రం ఎటువంటి ఆదరణ పొందుతుందో చూడాల్సిందే.
రెండు జంటలుగా మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ నటించారు. టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మాతలు. లక్ష్మణ్ మేనేని దర్శకత్వం వహించారు.