గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు సుబ్బయ్య శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి ఈ అత్యాచార ఘటన బయటకు పొక్కడంతో నిందితుడు ఇల్లు విడిచి పారిపోయిన విషయం
గుంటూరు జిల్లా దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు సుబ్బయ్య శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నిజానికి ఈ అత్యాచార ఘటన బయటకు పొక్కడంతో నిందితుడు ఇల్లు విడిచి పారిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు శుక్రవారం ఉదయం తమ బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోనే సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
కాగా, దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు సుబ్బయ్యను పట్టుకోవడానికి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పైగా, సుబ్బయ్య ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం పారితోషికం ప్రకటించడం, సుబ్బయ్య ఫోటోలతో పోస్టర్లు విడుదల చేయడంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అయితే సుబ్బయ్య తన బంధువులకు ఫోన్ చేసి.. తాను చనిపోతున్నట్టుగా చెప్పిన కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
గురజాల మండలం దైదా - తేలికుంట్ల మధ్య చెట్టుకు ఉరివేసుకుని ఆయన ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఈ విషయాన్ని నిర్ధారించేందుకు పోలీసులు ఘటనా స్థలానికి బయలుదేరారు.