Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీచర్‌ను కారులోకి ఎక్కించుకుని కామదాహం తీర్చుకున్న విద్యార్థులు

గురువు అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడుతో సమానమంటారు. కానీ బెంగళూరులో కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలినే చెరిచి ఆ తర్వాత హత్య చేశారు. వీరికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధ

Advertiesment
టీచర్‌ను కారులోకి ఎక్కించుకుని కామదాహం తీర్చుకున్న విద్యార్థులు
, గురువారం, 21 డిశెంబరు 2017 (13:51 IST)
గురువు అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడుతో సమానమంటారు. కానీ బెంగళూరులో కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు విద్యార్థులు దారుణానికి పాల్పడ్డారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయురాలినే చెరిచి ఆ తర్వాత హత్య చేశారు. వీరికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే... బెంగళూరు నగర శివారు బసవనపురలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 29 ఏళ్ల ఉపాధ్యాయురాలు విజ్ఞాన శాస్త్రాన్ని బోధిస్తుండేవారు.
 
ఈ క్రమంలో ఆమె 2009 ఆగస్టు 2న ఇంటికి వెళుతుండగా ఆమె వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు రవి, మంజునాథ్‌, రవీశ, నరసింహలు కారులో వెళుతూ చూసారు. వెంటనే కారు ఆపి... టీచర్ మిమ్మల్ని మీ ఇంటి వద్ద దింపుతామని కారు ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కొంత దూరం వెళ్లాక ఆమెకు కత్తి చూపించి బెదిరించి సావనదుర్గ పర్వత ప్రాంతాలవైపు ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై నలుగురూ సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను గొంతు నులిమి హత్య చేసి ఆమె ధరించిన నగలు దోచుకుని పరారయ్యారు.
 
ఐతే ఈ దారుణానికి పాల్పడిన నిందితులను పోలీసులు వెనువెంటనే అరెస్టు చేశారు. దీనిపై అప్పటి నుంచి కోర్టులో వాదనలు జరుగుతూనే వున్నాయి. చివరికి నేరం రుజువు కావడంతో నలుగురికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వారిని వదిలిపెట్టొద్దు... ప్రభుత్వం అప్పీల్ చేయాలి : సుబ్రమణ్య స్వామి