Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువతిపై గ్యాంగ్ రేప్.. టీ, గుట్కా తీసుకుంటూ 3 గంటల పాటు నరకం చూపించారు..

మధ్యప్రదేశ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పరిధిలోని హబీబ్ గంజ్ రైల్వేస్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తనపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులకు చెప్తే.. ఆ

Advertiesment
యువతిపై గ్యాంగ్ రేప్.. టీ, గుట్కా తీసుకుంటూ 3 గంటల పాటు నరకం చూపించారు..
, శుక్రవారం, 3 నవంబరు 2017 (16:57 IST)
మధ్యప్రదేశ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ పరిధిలోని హబీబ్ గంజ్ రైల్వేస్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తనపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులకు చెప్తే.. ఆమె మేకప్ వేసుకుని డ్రామాలేస్తోందని పోలీసులు హేళన చేశారు. ఈ ఘటనపై నిందితులతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులకు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆదేశించారు. 
 
వివరాల్లోకి వెళ్తే.. ఎంపీ నగర్ ప్రాంతంలో సివిల్స్‌కు కోచింగ్ తీసుకుని బాధితురాలు ఇంటికి వస్తుండగా.. గోలు, అమర్ అనే ఇద్దరు యువకులు ఆమెను అనుసరించి దాడి చేశారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారికి గంటూ, రాజేష్ అనే వ్యక్తులు జత కలిశారు. ఆపై ఆమెపై మూడు గంటలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. నరకం చూపించారు. టీ, గుట్కాలు తీసుకుని బ్రేక్ ఇచ్చి మరీ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తల్లిదండ్రులకు చెప్పి వారితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా.. వారు బాధితురాలు కట్టుకథలు అల్లుతోందని.. మేకప్ వేసుకుని డ్రామ చేస్తుందని హేళన చేశారు. 
 
దీంతో బాధిత యువతి తన కుటుంబ సభ్యులకు సంఘటనాస్థలి చూపించేందుకు తీసుకెళ్తుండగా, అక్కడ పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులను బాధితురాలి బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పరారీలో ఉన్న గంటూ, రాజేష్‌ల కోసం గాలింపు చేపట్టి, వారిపై 476 డీ, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఫైర్ అయ్యారు. ఈ కేసు విచారణ చేసేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేటీఎం ఇన్‌బాక్స్ ప్రారంభించింది : ఇన్-చాట్ చెల్లింపులతో మెసేజింగ్ వేదిక