Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడి భార్యపై లాడ్జిలో లైంగికదాడికి యత్నం.. వైకాపా నేత అరెస్ట్

గుంటూరు జిల్లా వైకాపా నాయకుడు, మాచర్ల మాజీ ఎంపీపీ రమావత్ నర్సింగ్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించడంతో రమావత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మాచర

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (12:49 IST)
గుంటూరు జిల్లా వైకాపా నాయకుడు, మాచర్ల మాజీ ఎంపీపీ రమావత్ నర్సింగ్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించడంతో రమావత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండాకు చెందిన రమావత్ నర్సింగ్ నాయక్ గతంలో వైకాపా తరపు వైసీపీ తరపున మాచర్ల ఎంపీపీగా పనిచేశారు. 
 
అదే గ్రామంలో వైకాపాకు చెందిన ఓ వ్యక్తి నాయక్‌కు బాల్య స్నేహితుడు. రెండు కుటుంబాల మధ్య స్నేహసంబంధాలు ఉన్నాయి. తాడేపల్లి మండలానికి చెందిన మహిళతో నాయక్‌ స్నేహితుడికి వివాహం అయ్యింది. ఇరు కుటుంబాల మధ్య స్నేహబంధం వుండటంతో గత నెల 27న తమ స్వగ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లే నిమిత్తం నర్సింగ్ నాయక్‌తో కలిసి ఆమె అచ్చమ్మకుంట నుంచి బయలుదేరింది.
 
గుంటూరులోని హిందూకళాశాల వద్ద వారు బస్సు దిగారు. హోటల్‌లో భోజనం చేసి వెళదామని ఆమెకు నర్సింగ్ నాయక్ చెప్పాడు. కానీ, అక్కడి రైల్వేస్టేషన్ రోడ్డులోని లాడ్జి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించడంతో ఆమె ప్రతిఘటించింది. 
 
ఇంటికెళ్లాక ఈ విషయాన్ని బాధితురాలు భర్తకు తెలియజేసింది. దీంతో ఈ నెల 1న రమావత్ నర్సింగ్ నాయక్‌పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం