తమిళనాడు గవర్నర్‌గా రెబల్ స్టార్ కృష్ణంరాజు..?!

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (19:21 IST)
ప్రముఖ తెలుగు నటుడు, రెబల్ స్టార్ కృష్టంరాజుకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్‌గా నియమించనున్నట్టు సోషల్ మీడియాలో ఆయన, ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు పేరు దాదాపు ఖరారైందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
అయితే కేంద్ర హోంశాఖ నుంచి గానీ.. కృష్ణంరాజు, ప్రభాస్ నుంచి గానీ.. ఆయన కుటుంబసభ్యుల నుంచి గానీ దీనిమీద ప్రకటన రాలేదు. కానీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం అభిమానులు ఈ వార్తను షేర్ చేసి పండగ చేసుకుంటున్నారు. 
 
ఇకపోతే.. నటుడిగా సక్సెస్ ఫుల్ కెరీర్‌లో ఉన్నప్పుడే 1990లో కృష్ణంరాజు బీజేపీలో చేరారు. రెండు దఫాలుగా ఎంపీగా పనిచేశారు. 2000-2002 వరకు వాజ్‌పేయి క్యాబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. 2014 దాకా బీజేపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన కూడా పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. కాగా.. 2016 లో తమిళనాడు గవర్నర్ పదవి నుంచి రోశయ్య వైదొలిగారు.
 
అప్పట్నుంచి ఆ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో గవర్నర్‌ను నియామకం కాలేదు. మధ్యలో కొన్ని రోజుల పాటు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన విద్యాసాగర్ రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పజెప్పింది. ఆయన తన పదవి నుంచి వైదొలిగిన నుంచి రాష్ట్రంలో రాజ్ భవన్ ఖాళీగానే ఉంది. ఇక తాజాగా కృష్ణంరాజు పేరు తెరపైకి రావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments