Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు. దహనం చేస్తాడు.. రాయన్ లో ధనుష్ క్యారెక్టర్ ఇదే !

డీవీ
బుధవారం, 17 జులై 2024 (15:48 IST)
Raayan latest still
సూపర్ స్టార్ ధనుష్ తన 50 మైల్ స్టోన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా రాయన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. 
 
'అడవిలో బలమైన జంతువులు పులి, సింహాలే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. ఎదురెదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తులుమారిది. గుంపుగా చుట్టుముట్టి ఒక పధకం వేసి సింహన్ని ఓడిస్తాయి'' అనే పవర్ ఫుల్ వాయిస్ ఇంట్రోతో మొదలైన ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయింది. 
 
'బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు. దహనం చేస్తాడు' అంటూ ధనుష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇవ్వడం గూస్ బంప్స్ తెప్పించింది. ధనుస్ మేకోవర్, యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. ట్రైలర్ లో సందీప్ కిషన్ ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగా వుంది. ఎస్ జే SJ సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, కాళిదాస్ జయరామ్ ఇంపార్ట్టెంట్ రోల్స్ లో కనిపించారు.
 
ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంది. ఓం ప్రకాష్ విజువల్స్,  ప్రసన్న జికె ఎడిటింగ్,  సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి.  పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది.
 
జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం... కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే..

Zakir Hussain Dies ఉస్తాద్ జాకీర్ హుస్సేనే ఇకలేరు... నిర్ధారించిన కుటుంబ సభ్యులు

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments