ధనుష్ యాక్టర్ గా తన 50వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ మరో లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం టైటిల్ 'రాయన్'. కాళిదాస్ జయరామ్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ రాయన్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూన్ 26న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ధనుష్ ఇంటెన్స్ పవర్ ఫుల్ లుక్ అదిరిపోయింది.
ఫస్ట్‌క్లాస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌తో హై టెక్నికల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, ధుషార విజయన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రసన్న జికె ఎడిటర్ గా, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
తారాగణం: ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, SJ సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్