Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కుబేర యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం

Shekhar Kammula at  Kubera set

డీవీ

, సోమవారం, 3 జూన్ 2024 (10:56 IST)
Shekhar Kammula at Kubera set
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ శేఖర్ కమ్ముల మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర' మెయిన్ యాక్షన్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది.
 
మొత్తం నటీనటులతో కూడిన హ్యుజ్ షెడ్యూల్ ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ధనుష్, నాగార్జున ఇద్దరూ కొన్ని బ్రీత్ టేకింగ్ స్టంట్స్ పెర్ఫార్ చేస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ ధనుష్ , నాగార్జునలను ఫస్ట్ లుక్ పోస్టర్‌లలో చూపిన విధంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ప్రెజెంట్ చేస్తోంది.
 
ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు టాకీ పార్ట్‌లు పూర్తయ్యాయి. రష్మిక మందన్న, జిమ్ సర్భ్ ఇతర ప్రముఖ పాత్రల్లో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ సోషల్ డ్రామా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.
 
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని డైరెక్టర్ చేయడం, ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లీడ్ లో నటించడం, ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించడంతో కుబేర ఇప్పటికే దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
 
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘శేఖర్ కమ్ముల కుబేర’ పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీ. తమిళం, తెలుగు,  హిందీ భాషల్లో ఏకకాలంలో షూట్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివాజీ గణేశన్ వల్లే ఇండియన్ సినిమా చేశాను : కమల్ హాసన్