Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

Advertiesment
సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

సెల్వి

, బుధవారం, 15 మే 2024 (20:57 IST)
సుచి లీక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుచిత్ర మాజీ భర్త కార్తీక్ కుమార్ మాత్రం ఆమె చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. మాజీ భార్య ఐశ్వర్యతో పోల్చితే ధనుష్ మంచివాడు అని చెప్పింది సుచిత్ర. 
 
ఐతే, ధనుష్ కూడా డ్రగ్స్ తీసుకుంటాడు అని, అలాగే అటు ఆడవాళ్ళతో, ఇటు గేలతో ధనుష్‌కి అక్రమ సంబంధాలు ఉన్నట్లుగా మాట్లాడింది. అందుకే, ధనుష్ ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. ధనుష్ అభిమానులు ఇప్పుడు ఇతర హీరోలను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. 
 
అలాగే సుచిత్ర గతంలో రకరకాలుగా మాట్లాడిన పాత వీడియో క్లిప్పులను బయటికి తీశారు. తమ హీరోని కావాలని బద్నామ్ చేస్తున్నారు అని ధనుష్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ధనుష్ ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ముల తీస్తున్న తెలుగు చిత్రం కుబేరలో నటిస్తున్నాడు.
 
అలాగే తాజా ఇంటర్వ్యూలో సుచిత్ర మరోసారి త్రిష గురించి ప్రస్తావన తెచ్చింది. అప్పట్లో సుచి లీక్స్ బయటపడడంలో త్రిష పాత్ర ఉంది అనే ఆమె ఇప్పుడు చెప్పింది. బయటికి కనిపించే త్రిష వేరు, నిజమైన త్రిష వేరు.. అంటూ పేర్కొన్నారు. 
 
ఓ పత్రికకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో ధనుష్, ధనుష్ మాజీ భార్య, త్రిష, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, ఇంకా పలువురు తమిళ సెలెబ్రిటీల గురించి మాట్లాడింది. అలాగే తన మాజీ భర్త, నటుడు కార్తీక్ కుమార్ గే అని పేర్కొంది. అయితే ఈ వార్తలను కార్తీక్ కొట్టిపారేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది