Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధనుష్, నాగార్జున చిత్రం కుబేర కీలక షెడ్యూల్ ముంబైలో ప్రారంభం

Advertiesment
kubera mumbai poster

డీవీ

, శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (15:10 IST)
kubera mumbai poster
గత నెలలో ఫస్ట్‌లుక్‌ విడుదలైన తర్వాత 'కుబేర'పై ఎక్సయిట్మెంట్ రెట్టింపైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ ఫస్ట్ లుక్‌లో ఊహించని అవతార్‌లో కనిపించారు. కింగ్ నాగార్జున అక్కినేని క్లాస్ అవతార్‌లో కనిపిస్తున్న బ్యాంకాక్ షెడ్యూల్ నుండి స్నీక్ పీక్ మరొక పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. వర్కింగ్ స్టిల్స్‌లో నాగ్ లుక్ రివీల్ కానప్పటికీ, అతనిని స్టైలిష్ లుక్‌లో చూసి అభిమానులు ఫిదా అయ్యారు.
 
రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్‌లను అందించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మకంగా 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్, నాగార్జునలను లీడ్ పాత్రలకు ఎంపిక చేయడం ఈ చిత్రానికి మొదటి విజయం. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్)  బ్యానర్‌పై శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో ధనుష్ సరసన రష్మిక మందన్న కథానాయిక.  సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
సినిమా చుట్టూ ఉన్న బజ్‌ని దృష్టిలో ఉంచుకుని, శేఖర్ కమ్ముల అండ్ టీమ్ చాలా జాగ్రత్తతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. మాగ్నమ్ ఓపస్ కోసం ఈ మ్యాసీవ్ షెడ్యూల్ 12 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రదేశాలలో షూట్ చేస్తున్నారు. ఇది కీలకమైన, లెన్తీ షెడ్యూల్. ఈ షెడ్యూల్ లో ధనుష్, రష్మిక మందన్న, ఇతరులతో కూడిన కొన్ని ముఖ్యమైన టాకీ పార్ట్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు చిత్రీకరిస్తున్నారు.  విజువల్స్ చాలా అద్భుతమైన ఉండబోతున్నాయి. టీమ్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో ధనుష్ వాటర్ పైప్‌లైన్ పైన నిలబడి ఉన్నట్లు ప్రజెంట్ చేస్తోంది.
 
ఈ ఏడాది వస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో హై బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో కుబేర ఒకటి. ఇంతకుముందు సెన్సిబుల్, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేసిన శేఖర్ కమ్ముల అన్ని కమర్షియల్ హంగులను సరైన నిష్పత్తిలో కలిగి ఉండే కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు.  ధనుష్, నాగార్జున అభిమానులు తమ అభిమాన స్టార్స్ ని కలిసి తెరపై చూడాలని క్యురియాసిటీతో ఉన్నారు. ధనుష్, నాగార్జున పాత్రలతో పాటు రష్మిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది.
తారాగణం: ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన, జిమ్ సర్భ్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓదెలా 2లో నాగ సాధువుగా తమన్నా భాటియా